March 13, 2013

పిల్లల కోసం మనమేమయినా చేస్తాము కదా?!

This post has to be in Telugu. It is about the Telugu lesson sessions with Malini during her Class 10 exams.
_______________________________________________________________________

13 మార్చ్ 2013

ఇప్పుడే మాలిని తెలుగు పరీక్ష వ్రాయడానికి వెళ్ళినది. కృత ఆరు నెలలనుంచి మేమిద్దరం రాత్రి 10 గంటలనుంచి 11 గంటలవరకు రోజు తెలుగు చదువుతున్నాము. ఎందువలన అంటే మాలిని 10 వ తరగతి మొదలు పెట్టగానే, పరిక్షలలో చాల తక్కువ మార్కులు తెచ్చుకునేది. కొన్నిసార్లు ఉత్తిర్నత కూడా పొన్దలెదు. నా కూతురు తన మాతృభాషలో సఫలం కావడంలేదన్న మాట నన్ను పట్టి పీడించ సాగిన్ది.

ఎవరిదగ్గరయినా ట్యూషన్ పెట్టిద్దామని అనుకున్నను. కాని, అప్పుడే గణిత క్లాస్స్కు శైలజగారి దగ్గరకు రోజు వేల్ల్లుతూనే ఉన్ది.  పైగా, సంగీతం కూడా మానేసింది. ఇక తెలుగు ట్యూషన్ కొరకు సమయమెక్కడ ఉంది?

సరే, నేనే కష్టపడి, నా పదవతరగతి తెలుగు గుర్తుచేసుకొని మాలినికి కొంచం సహాయం చేద్దామని నిశ్చయము చేసుకున్నను. 25 ఎండ్లనుంచి తెలుగు చదవడం వ్రాయడం అలవాటులేదని చెప్పుటకు సిగ్గుగా ఉన్ది. కానీ, ఇది ఉన్న మాట. మొదట వ్యాకరణము, వ్యాసాలు మరియు లేఖలు మాత్రమే వ్రాయిద్దామని అనుకున్నాను. కాని, తరువాత గద్యము కూడా చదివి తనకు చేబుదామన్న సంకల్పము కలిగింది. గద్యకుసుమావళ్లిలో 7 పాఠాలున్నాయి. ఏడే కదా అనుకోవచ్చు, కానీ అవి చాల కఠీనంగా ఉన్నాయి. సరే, చదవడం మొదలుపెట్టాను. వీరేశలింగంగారి స్వీయచరిత్ర నుండి కళోపాసనం దాక ఎన్నో విషయాలు మంచి తెలుగులో చదివి అర్థంచేసుకున్నాను. లోకంలో దుర్లభాల గురించి, ఆంధ్ర దేశానికీ ఆ పేరు రావడానికి కారణంగురించి, వివేకానందుడు బోస్టన్ లో పడిన కష్టాల గురించి నేను నెర్చుకున్నాను.

మొదట 14 ఏండ్ల టీనేజర్ అయిన మాలిని న ప్రయత్నాన్ని కొంచం చిన్న చూపు చోసిన్ది. 15 నిముషాలు మాత్రమే కూర్చుని, ఏదో తొందరగా వ్రాసి వెళ్ళిపోయేది . కానీ, రెండు నెలలనుండి ద్రుఢసంకల్పంతో నేర్చుకోవడం మొదలుపెట్టింది. రోజు ఘంటసేపు ఇద్దరం కూర్చుని వ్యాసాలు వ్రాయడం లేఖలు వ్రాయడం, జాతీయాలు నేర్చుకోవడం జరుగుతోంది. "కుక్కతోకపట్టుకుని గోదావరి ఈదటం", "కుక్కిన పేను", "ఎ యెండకాగొడుగు పట్టటం" లాంటి జాతీయాలు రోజు సంభాషణలో వాడటం, అవి సరిగ్గా వడామన్న సంతోషముతో పరిహసించటం...ఈ విధంగా మేమిద్దరం పాఠాలే  కాక తెలుగు భాష కొంచం నెర్చుకున్నాము.

ఈ తెలుగు పాఠాలు చెయ్యబట్టి మా ఇద్దరిమధ్య మంచి స్నేహం ఎర్పడినది. నేనే పరీక్ష వ్రాస్తున్నానన్న ఉత్సాహం నాలో కలిగిన్ది.

నేనిది వ్రాయు సమయంలో మాలిని పరీక్ష వ్రాస్తూ ఉంటుంది. తనకు గొప్ప మార్కులు రాకపోయినా, మంచి మార్కులే వస్తాయని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను. ఏదయినా, ఈ జ్ఞ్యానము ఎప్పుడో ఒకప్పుడు తప్పక వాడుతాము.

ఆరు నెలలు బుద్బుధప్రాయంలా  మాయమయినాయి. ఇక రిజల్ట్స్ కొరకు రెండు నెలలు వేచియుండాలి. "కష్టే ఫలే" అన్న మాటలు నమ్ముకుని, వచ్చే సెలవులు ఆనందంగా గదుపూతాము.


_____________________________________________________________
ఇప్పుడిప్పుడే నేర్చుకున్న కొన్ని పదాలు వాడాను. తప్పులేమయిన ఉంటే క్షమించండి! :)


Edit 17 మే 2013: మాలినికి  69% మార్కులు వచ్చాయి. చాలా చాలా సంతోషంగా ఉంది!